ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి


విద్యాశాఖ మంత్రి ఆఫీస్ వద్ద ధర్నా

టి.ఆర్.టి -2017 లో మిగిలిన ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టులను మెరిట్ అభ్యర్థులతో వెంటనే భర్తీ చేయాలని కోరుతూ ఆవాజ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉర్దూ మీడియం ట్రెయిన్డ్ ఉపాధ్యాయులు బషీర్ బాగ్ లోని విద్యాశాఖ మంత్రి ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ ఉర్దూ మీడియంలో బోధించే ఉపాధ్యాయులు లేక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. టి.ఆర్.టి -2017 లో మిగిలిన ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టులను తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ సర్విస్ రూల్స్ 22(2)(H) ప్రకారం అందుబాటులో ఉన్న టి.ఆర్.టి -2017 ఉర్దూ మీడియం మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేసి ఉర్దూ మీడియం విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఏప్రిల్ 10న ప్రగతి భవన్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఉర్దూట్రైనుడు టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మొహిజుద్దిన్, ప్రధాన కార్యదర్శి ఫరూక్ , సయ్యద్ హమీద్, మైమూన్, ఫర్జానాతో పాటు వివిధ జిల్లాల ఉర్దూ ట్రైనుడు టీచర్స్ పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.