ఉస్మానియా ఆసుపత్రిలో ఖరీదైన ఇంజక్షన్లు మాయం అయ్యాయి. హార్ట్సర్జరీ, పెరాలసిస్‌కు చెందిన ఇంజక్షన్ల స్టాక్‌లో తేడాలు రావడంతో ఆసుపత్రి అధికారులు టాస్క్ఫోర్సు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అనుమానితులందరినీ ప్రశ్నించగా, డేటా ఎంట్రీ ఆపరేటర్మాయం చేసినట్లు తేలింది. దీంతో ఆయన ఇంట్లో ఉన్న ఇంజక్షన్ల వయల్స్‌ను టాస్క్‌ఫోర్స్ టీమ్స్వాధీనం చేసుకుని విచారిస్తున్నది. ఫార్మసిస్టులను కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎప్పట్నుంచి జరుగుతున్నది?
ఎవరెవరి పాత్ర ఉన్నదనేదానిపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్నది. మరోవైపు ఆసుపత్రి అధికారులు సైతం అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. హాస్పిటల్‌లోని అన్ని విభాగాల్లో ఎంక్వైరీ చేసి సోమవారం సూపరింటెండెంట్‌కు నివేదికను సమర్పించనున్నారు. దాని బట్టి చర్యలు తీసుకునే ఛాన్స్ఉన్నట్లు తెలుస్తోన్నది. ఇదిలా ఉండగా ఈ అంశంపై ఉన్నతాధికారులెవ్వరూ స్పందించేందుకు ఆసక్తి చూపలేదు.
