ఎండిపోతున్న పంటలకు నీరందించాలి

పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి, జిల్లాలో ఎండిపోతున్న పంటపొలాలకు దేవాదుల ద్వారా నీరందించి, రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు.

దివి: 06-04-2021మంగళవారం రోజున పట్టణంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో సంఘం జిల్లా కమిటీ సంఘం అధ్యక్షులు రాపర్తి సోమన్న అధ్యక్షతన ఏర్పాటు చేయగా ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోకు కనకారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసిన రైతులు జిల్లాలో భూగర్భజలాలు అడుగంటి వ్యవసాయ బోర్లు ఎండిపోవడంతో పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ఒక ఎకరం పంట కూడా ఎండ నివ్వమని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం మాటలు ఆచరణకు నోచుకోలేదని విమర్శించారు. జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటడంతో వ్యవసాయ బోర్లు ఎండిపోయి వేలాది ఎకరాల్లో వరి పంట ఎండి పోయిందని వెంటనే ఎండిపోతున్న పంటలకు దేవాదుల ద్వారా నీరందించాలని డిమాండ్ చేశారు. తెలిపారు. పంటపొలాల్లో పశువులను మేపుతున్న దుస్థితి నెలకొందన్నారు. ఎండిపోయినా వరిపంటకు ఏకరానికి 50 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కొద్ది పంటలు చేతికోస్తున్న తరుణంలో వరికోత యంత్రాల యజమానులు ఎకరా వరి కోతకు అధిక ధరలు నిర్ణయించి రైతులను దోపిడీ చేసే పరిస్థితులు ఉన్నవని తెలిపారు. జిల్లా ఉన్నతాధికారులు జిల్లా మొత్తం ఒకేవిధమైన రేట్లు ఉండేవిధంగా వరికోత యంత్రాల యజమానులకు అనుమతులివ్వాలని అన్నారు. పంట కోతలు ప్రారంభం అయ్యాయి కాబట్టి వెనువెంటనే ఐకేపీ సెంటర్లు ప్రారంభించి సరుకుల కొనుగోళ్లు మొదలు పెట్టాలని ఈ సందర్బంగా గన్నీబ్యాగుల, హమాలీల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో R.మీట్యానాయక్, గొల్లపల్లి బాపురెడ్డి, సాదం జంపన్న, M.బీరయ్య, గురజాల లక్ష్మినర్సింహారెడ్డి, రామచొక్కం, బిక్షపతి, సత్తిరెడ్డి, ఉప్పల్లయ్య తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.