#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69News

ఇది ప్రజాస్వామ్య పాలననా లేక రాచరిక పాలననా?————————–
సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి డిమాండ్

గత మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో తీర్మానాలు చేసిన పనులు ఎందుకు చేయలేదని నిలదీసినందుకు జనగామ జిల్లా చిల్పూర్ మండల వెంకటాద్రిపేట గ్రామ ఎంపిటిసి ఎన్నకుస కుమార్ ను అధికారులు అరెస్టు చేయించడం అప్రజాస్వామికమని, ప్రభుత్వ విధానాలను ఎండగట్టినందుకు ఇలా ఎందరిని అరెస్టులు చేయిస్తారని సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దివి: 29-04-2022 శుక్రవారం రోజున జనగామ పట్టణ కేంద్రంలోని స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ పట్టణ కమిటీ సభ్యులు బిట్ల గణేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి పాల్గొని మాట్లాడుతూ గ్రామంలో పనులు జరగకుండా, నిధులు మంజూరు చేయకుండా అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని దీనికి ఎంపిడివో మరియు అధికారులు అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. చిల్పూర్ మండల పరిషత్ లో సర్వసభ్య సమావేశంలో వెంకటాద్రిపేట సిపిఎం ఎంపిటిసి ఎన్నకుస కుమార్ పాల్గొని గత సమావేశంలో తీర్మానాలు చేసిన పనులు ఎందుకు చేయలేదని నిలదీసినందుకు అధికారులు అరెస్టు చేయించడం సరికాదని విమర్శించారు. ప్రజాప్రతినిధులుగా గెలిచి కుర్చీకి పరిమితం కాకుండా ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు నిలదీసే సిపిఎం ఎంపిటిసి ని అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమని పోలీసులు కూడా అధికారపార్టీకి విధేయులుగా ఉండటం సరికాదని అన్నారు. మనము ప్రజాస్వామ్యపాలనలోనే ఉన్నామా లేక రాచరిక పాలనలో ఉన్నామా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజల సంక్షేమం కోసం ఎంపిటిసి ఎన్నకుస కుమార్ లేవనెత్తిన అంశాలను పరిష్కరించాలని లేనిపక్షంలో పార్టీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పోత్కనూరి ఉపేందర్, భూక్యా చందు నాయక్, నాయకులు అజ్మీరా సురేష్, గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.