ఎంపీడీవో నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఆదివారం సుమారు కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన ఎంపీడీవో కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, అనంతరం మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మండల సభ ద్వారా తీర్మానం చేయడం జరిగింది, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా చూడాలని అన్నారు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 42 మంది లబ్ధిదారులు చెక్కుల పంపిణీ చేశారు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు రెండు లక్షల 36 వేల చెక్కులను లబ్ధిదారులకు అందించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ దావు వినోద్, జడ్పిటిసి గొర్రె సాగర్, పిఎసిఎస్ చైర్మన్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వైస్ చైర్మన్ గణపతి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఆరెపల్లి మల్లయ్య, స్థానిక సర్పంచ్ పూర్ణచంద్రరావు, ఎంపీటీసీ కటుకూరి పద్మ నరేందర్, ఎంపీడీవో, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.