ఎంసిపిఐ ఆలిండియా కార్యదర్శి ఎండి గౌస్ మరణం వామపక్ష ఉద్యమానికి మరియు ఎస్సీ, ఎస్టీ ,బీసీ., మైనార్టీ ,వర్గాలకు తీరని నష్టమని సిపిఎం జూబ్లీహిల్స్ జోన్ కన్వీనర్ రాపర్తి అశోక్ అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ జోన్ రహ్మత్ నగర్ లో ఈరోజు గౌస్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. చిన్ననాటి నుంచి వామపక్ష ఉద్యమంలో ఉండే అంచలంచలుగా ఆలిండియా కార్యదర్శిగా ఎదిగారని ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే వ్యక్తిని కరోనా వల్ల కోల్పోవడం చాలా దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రజలందరికీ టీకాలు వేయించాలి .అని ప్రజలు కూడా అందరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ వారి ప్రజలు పనులను చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు .భాగ్యరాజు ,లొంక సంపత్ ,చిట్టి ,సంగమేష్, Benare, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు