ఈ69న్యూస్ రాయపర్తి జులై 20
వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన దర్గా పాష ముహమ్మద్ (జావేద్ అహ్మద్)కు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ డా. జి.యస్.గాబ్రియేల్ పర్యవేక్షణలో భాషాశాస్త్ర శాఖకు సమర్పించిన ఎం.ఫిల్ పరిశోధన”హజ్రత్ ముహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర – శైలీ విశ్లేషణ”అనే గ్రంథానికి స్వర్ణ పతకం లభించినది.
ఈ రోజు హైదరాబాద్ రవీంద్రభారతిలో
శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 15 స్నాతకోత్సవం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అధ్యక్షతన జరిగింది.
తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ చేతుల మీదుగా వారు స్వర్ణపతకం తీసుకోవడం జరిగినది.
ఈ కార్యక్రమంలో శ్రీ పొట్టి రాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ వైస్ ఛాన్స్ లర్ తంగెడ కిషన్ రావు, రిజిస్ట్రార్ బట్టు రమేష్ యూనివర్సిటీ విద్యార్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.