ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోండి

కంచికచర్ల మండలం పేరుకలపాడు, కీసర, గండేపల్లి, పెండ్యాల, వేములపల్లి, ఎస్ అమరవరం,మొగులూరు కునికినపాడు, చెవిటికల్లు, గని అత్కూరు గ్రామాల్లో ఫ్లాగ్ మార్చి్ నిర్వహించీ గ్రామస్తులకు రూరల్ సీఐ సతీష్, అజీజ్ (దిశా డి.ఎస్.పి), ఎస్సై లు రంగనాథ్, శ్రీమతి జె లక్ష్మీ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 9వ తారీఖున మీ మీ గ్రామాలలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గ్రామస్తులు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, ఎటువంటి గొడవలకు వెళ్లకుండా, ప్రశాంతమైన వాతావరణంలో మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని, గెలుపోటములు సహజమని ఏ పార్టీలో పోటీ చేసిన అభ్యర్థి అయినా సరే మన గ్రామస్తుడే అన్న విషయాన్ని మరవకండి. ఇప్పటికే సమస్యాత్మకమైన గ్రామాలను గుర్తించడం జరిగిందని, అలాగే అలజడులు సృష్టించే వారిని గుర్తించి బైండోవర్ చేయటం జరిగిందని, బైండోవర్ అంటే సామాన్యమైన విషయం కాదని, పది లక్షల రూపాయల ఆస్తి నామిని గా ఉంచి, జామిన్ ఇవ్వటం జరుగుతుందని, ఆ విషయం తెలియక ఏదో వెళ్ళాము స్టేషన్ కి, సంతకం పెట్టాము, వచ్చాము అనుకోవద్దని, ప్రతి ఒక్కరి పై నిఘా ఉంటుందని, కక్షలు కార్పణ్యాలు కు పోయి మీ జీవితాలను మీ పిల్లల జీవితాలను చెడగొట్ట వద్దని, ఒక్కసారి కేసు నమోదు అయితే ప్రభుత్వ, ప్రవేట్ ఉద్యోగాలు కావాలి అంటే మీ పిల్లలపై కేసు నమోదు అయితే ఆయా ఉద్యోగాలు రావని ఈ విషయాన్ని మరువద్దని, పోటీ చేసే అభ్యర్థి ఎవరైనా సరే మన గ్రామస్తుడే అన్న విషయాన్ని మరవకండి అని, ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని, అలాగే ఎన్నికల నిర్వహించు ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఏదో హడావుడి గా వచ్చారు, వెళ్ళారు, చెప్పారు, విన్నాము అనుకోవద్దని, ప్రతి ఒక్కరిపై ప్రతి గ్రామంలో నిఘా ఉంటుందని, ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాడులు ప్రతి దాడులు నిర్వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నందిగామ రూరల్ సీఐ సతీష్, అజీజ్ (దిశ డిఎస్పి), కంచికచర్ల ఎస్సై రంగనాథ్, ఎస్సై 2 శ్రీమతి లక్ష్మి, చందర్లపాడు ఎస్సై ఏసోబు, స్పెషల్ సిఐ బాలశౌరి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.