తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతాపార్టీ అవతరించిందని , రాబోయే రోజుల్లో బిజెపి తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బిజెపి సిద్ధంగా ఉండాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ శాసనసభ్యులు , కరీంనగర్ జిల్లా ఇన్చార్జి ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ పిలుపునిచ్చారు. బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అధ్యక్షతన శుక్రవారం హుజురాబాద్, మానకొండూరు, చొప్పదండి, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పదాధికారుల సమీక్ష సమావేశాలు ఆయా నియోజకవర్గాల్లో జరిగాయి. ఇట్టి సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రధాని మోడీ నాయకత్వంలో దేశ భద్రత ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం ఖుషి చేస్తుంటే, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ చేతిలో పెడితే సర్వనాశనం చేశారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో