ఎన్ హెచ్ -365 పై విస్తృతంగా వాహనాల తనిఖీలు

ఎన్ హెచ్ -365 పై విస్తృతంగా వాహనాల తనిఖీలు.. కురవి ఎస్ఐ జక్కుల.శంకర్ రావు పర్యవేక్షణలో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. ఎన్ హెచ్-365 పైన కురవి మండలకేంద్రంలో ఎస్ఐ జక్కుల.శంకర్ రావు పర్యవేక్షణలో విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబందించిన పత్రాలు పరిశీలించడంతోపాటు.. డ్రంక్అండ్ డ్రైవ్ పరీక్షలు చేసారు. ఈ..సందర్భంగా ఎస్ఐ శంకర్ రావు మాట్లాడుతూ.. వాహనదారులు నిబందనలమేరకు నడుచుకోవాలన్నారు. *అతివేగం.. మద్యంసేవించి వాహనాలు నడపడం వంటి చర్యల మూలంగా ప్రమాదాలు పెరుగుతాయని..ప్రాణనష్టం అధికంగా ఉంటుందన్నారు. వస్తురవాణాకు ఉపయోగించాల్సిన వాహనాల్లో ప్రయాణీకులను తరలించడం.. వాహనసామర్ధ్యానికి మించి ప్రయాణీకులను తరలించడం వంటి చర్యలను ఉపేక్షించేది లేదన్నారు.ప్రతిఒక్కరూ.. నిబందనలకు లోబడి సురక్షితంగా ప్రయాణాలు కొనసాగించాలని ఎస్ఐ శంకర్ రావు సూచించారు..

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.