Telugu News Today | తెలుగు వార్తలు |Telugu News|Latest News in Telugu|

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా-ఎమ్మెల్యే డా.రాజయ్య

కాంగ్రేస్ & బీజేపీ పార్టీల నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరినవారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాము-ఎమ్మెల్యే డా.రాజయ్య

ఈ రోజు…ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం నందు మండల పార్టీ అధ్యక్షులు మాచర్ల గణేష్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మండల యూత్ అధ్యక్షులు గుండె మల్లేష్ గారి ఆధ్వర్యంలో స్టేషన్ ఘనుపూర్ మండలంలోని వివిధ గ్రామాల నుండి 20 మంది కాంగ్రెస్ , బిజెపి & పార్టీలకు చెందిన 20 మంది యువకులు తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రివర్యులు , ఎమ్మెల్యే డాక్టర్. తాటికొండ రాజయ్య గారి సమక్షంలో భారీ సంఖ్యలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే డా.రాజయ్య వారికి టిఆర్ఎస్ పార్టీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలకు మరిముఖ్యంగా దళితుల సమగ్రాభివృద్ధి కోసం తీసుకువచ్చిన దళితబంధు పథమునకు ఆకర్షితులై అదేవిధంగా స్థానికంగా ఎమ్మెల్యే రాజయ్య గారు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న తిరునూ దగ్గరగా చూసిన వారిగా మరియు గ్రామాలు అభివృద్ధి చెందాలన్న , దళితులు సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే అది టిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం , నియోజకవర్గ ఎమ్మెల్యే గారితోనే సాధ్యమని భావించి స్టేషన్ ఘనుపూర్ మండలంలోని వివిధ గ్రామాలకి చెందిన 20 మంది యువకులు కాంగ్రేస్ , బిజెపి & టిడిపి పార్టీల నుండి ఎమ్మెల్యే గారి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.వారికి టిఆర్ఎస్ పార్టీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఎమ్మెల్యే గారి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిన వారి వివరాలు:
సింగపురం శ్రీనివాస్-ఘనుపూర్
పోనగంటి సుధీర్ ,
తాటికొండ విల్సన్ ,
చింత ప్రవీణ్ ,
చింత అంజి,
కొత్తపల్లి కుమార్ ,
గాదే అశోక్-నమిలిగొండ ,
గాదే అరవింద్ ,
గుండె ప్రశాంత్-సముద్రాల ,
గుండె సంపత్ గార్లు తదితరులు…

ఈ కార్యక్రమంలో అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులు , ముఖ్య నాయకులు మరియు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.