ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు రానున్న ఎన్నికల్లో పరాభవం తప్పదు

కాంగ్రెస్ పార్టీ నుండి రాజకీయ ఓనమాలు నేర్చి రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీని కాలు చెప్పుతో సమానమని సంబోధించడం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అహంకారానికి,దిగజారుడు తనానికి అహంబావానికి నిదర్శనమని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ యువజన వైస్ ప్రెసిడెంట్ తాటికాయల రాజేందర్ అన్నారు. అధికారాన్ని ఉపయోగించుకొని చెయ్యరాని పనులు చేస్తూ అవినీతికి మరో రూపంలా రాజ్యమేలుతున్నారని దుయ్యబట్టారు. నియోజకవర్గ పరిధిలో పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ప్రజల నుండీ అధికారుల నుండి పర్సంటేజీలు వసూలు చేస్తున్న తాటికొండ రాజయ్యకు రానున్న ఎన్నికల్లో పరాభవం తప్పదని,అధికార బలంతో అవినీతి తిమింగలంల మారి టిఆర్ఎస్ పాలనలో అక్రమార్జన సొమ్ము తో పైకొచ్చి కాంగ్రెస్ పార్టీనీ మీకాలు చెప్పుతో సమానమని మాట్లాడుతున్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ను టిఆర్ఎస్ పార్టీని రానున్న ఎన్నికల్లో రాజకీయ సమాధి చెయ్యడానికి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని రాజేందర్ అన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.