ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ను వి-హబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సి.ఈ.ఓ) దీప్తి రావుల శనివారం శివనగర్ లోని క్యాంపు కార్యాలయం లో మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్రం లో రెండవ అతిపెద్ద నగరమైన వరంగల్ యందు స్వయం సహాయక మహిళ బృంద సభ్యులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడానికి వీ హబ్ చర్యలు చేపట్టడం జరుగుతుందని, ఇట్టి నేపథ్యం లో నగరంలో వి-హబ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సహకారం అందించాలని సి.ఈ ఓ. ఎమ్మెల్యే ను కోరారు. ఈ కార్యక్రమంలో వి-హబ్ ఉపాధ్యాక్షురాలు శకుంతల,స్పాన్సర్ షిప్ మేనేజర్ రమ్య తదితరులు పాల్గొన్నారు