పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోప్రచారం నిర్వహించిన సిపిఐ, సిపిఎం నాయకులు*
: నల్లగొండ వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్షాల తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారథి రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి పట్టభద్రులు గెలిపించాలని సిపి ఐ,సిపిఎం జిల్లా కార్యదర్శి లు సిహెచ్ రాజారెడ్డి, మూకు కనకా రెడ్డి లు కోరారు*
* సిపిఐ, సిపిఎం, మంగళవారం స్థానిక పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలోజయసారథి రెడ్డి గెలుపును కాంక్షిస్తూ పట్టభద్రులను ఓట్లు వేయాలని కోరుతూ వివిధ ప్రైవేటు స్కూల్స్ లో ప్రచారం నిర్వహించారు,అనంతరం చాకలి ఐలమ్మ స్మారక భవన్లో ఏర్పాటు చేసిన సమావేశానికి సిపిఎం మండల కార్యదర్శి చిట్యాల సోమన్న అధ్యక్షత వహించగాఈ సందర్భంగా రాజారెడ్డి, మోకు కనుక రెడ్డిలు పాల్గొని మాట్లాడుతూ నల్లగొండ, వరంగల్ ,ఖమ్మం ఉమ్మడి జిల్లాలో నాటి నుండి నేటి వరకు భూస్వామ్య పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా పేద ప్రజల పక్షాన అనేక పోరాటాలు త్యాగాలు చేసింది కమ్యూనిస్టు లేనని పేర్కొన్నారు, వెట్టిచాకిరి రద్దు చేయాలని
భూ సంస్కరణలు అమలు చేసి భూములను పేదలకు పంచాలని నిరుద్యోగుల
*కు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిరంతరం ప్రజల కోసం పోరాడేది వామపక్షాలని తెలిపారు, వామపక్షాలఅభ్యర్థిగా జయసారధి రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు, *ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న బీజేపీ టీఆర్ఎస్ పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల ఓడించాలని కోరారు, ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు సోమ సత్యం, మండల నాయకులు మాచర్ల సారయ్య, మాసం పల్లి నాగయ్య, బానోత్ కిషన్ నాయక్, ముస్కు ఇంద్రారెడ్డి, బెల్లి సంపత్, తదితరులు పాల్గొన్నారు