ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో జంగా రాఘవ రెడ్డి

కాజీపేట మండలం సోమిడిలోవరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ జిల్లా అధ్యక్షులు జంగా రాఘవ రెడ్డి తాళ్ల పద్మావతి కళాశాలలో ఉపాధ్యాయులను మరియు ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న B.ed టీచర్లను కలిసి మార్చి 14 న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ రాములు నాయక్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ పాలన నుండి సామాన్య మానవులకు విముక్తి కలగాలంటే మేధావులైన గ్రాడ్యుయేట్ లే తమ ఓటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు పూరిస్తూ ఊరిస్తూ ఒక్కసారి కూడా డీఎస్సీ ప్రకటించలేదు దానికి తోడు.. ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో ఆ సమయంలో ఏదో హడావుడి చేసినట్టు ఉద్యోగాల ప్రకటన ఇస్తున్నాము అన్నట్టుగా పేపర్లలో ఫోజుల వరకే సరిపోతుంది. 2019 ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వానికి మళ్లీ ఓట్లు అడిగే హక్కే లేదు. ఇంకా సిగ్గు లేకుండా టిఆర్ఎస్ నాయకులు ఓట్లు అడుగుతున్నారు. ఒక నిరుద్యోగి గొంతుగా అడుగుతున్నా ఏం చేశారని మీకు ఓట్లు వేయాలి. ఏ ఒక్క యూనివర్సిటీ కి సరైన విసిలు లేక విద్యార్థులు ఉద్యోగులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలను గుర్తుచేసుకుంటూ ప్రజల ఓట్లు అవసరం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ దగ్గరికి వస్తూ వారికి ఏదైనా అవసరం వచ్చి కలవాలంటే కలిసే దిక్కు లేకుండా అయిపోయింది. ఇలాంటి దొంగల రాజ్యం పోవాలంటే పట్టభద్రుల రా మేల్కొండి మార్చి 14 న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ రాములు నాయక్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని ఆశిస్తున్నా.
ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ జక్కుల రమ రవీందర్ యాదవ్ లింగం మౌనిక చరణ్ రెడ్డి గారు తొట్ల రాజు గుర్రపు కోటేశ్వర్
బోయిని కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.