తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, యం.ఎల్.సి శ్రీ కడియం శ్రీహరి
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి టి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కి మద్దతుగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
వేలేరు మండల కేంద్రం లోని రెడ్డి కమ్యూనిటీ హాల్ నందు వేలేరు మండలం యొక్క అన్ని గ్రామాల పట్టభద్ర ఓటర్లతో సమావేశమై ప్రచారం నిర్వహించారు. ఈ సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ…
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మన ప్రాంత వాసి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో వేలేరు మండలం చాలా వెనుకబడిన ప్రాంతమని అప్పట్లో ఎండాకాలం వచ్చిందంటే ప్రజలకు త్రాగడానికి మంచినీరు కూడా దొరికేవి కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకనే ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ పథకం తో మంచినీటిని అందిస్తున్నామని అన్నారు. వేలేరు మండలానికి సాగునీరు అందించే బాధ్యత మాపైనే ఉందని హామీ ఇచ్చారు. బిజెపి నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నరని, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసింది
