ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి

ఆరు దశబ్దాల పాటు తెలంగాణ రాష్ట్రం అవశ్యతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత ఉద్యమ శిఖరం ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని తానంచర్ల హైస్కూల్లో ఎస్ఎఫ్ఐ వీరబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి కొనియాడారు, ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర నాయకులు పెద్ద బోయిన వీరబాబు మాట్లాడుతూ ప్రొఫెసర్ గారి శ్వాస ,ఆశ, స్వప్నం, అంతా తెలంగాణ నే ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాన్ని అంకితం చేశారు, చివరి వరకు తన నినాదాన్ని ఆపలేదు, తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆ జన్మ జీవించార ఆయనే మళ్లీ దశ, ఉద్యమానికి మార్గదర్శకుడు. సార్ అని అందరూ ప్రేమగా పిలుచుకునే ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ప్రత్యేక రాష్ట్రమే అంతిమ లక్ష్యంగా, ఉద్యమ భావజాలాన్ని జనంలోకి తీసుకెళ్లారు, రాష్ట్ర సాధనకు దారి చూపించారు, జయశంకర్ జయంతి ఈరోజు అందరు గుర్తుచేసుకుంటున్నామంటే తెలంగాణ ఏర్పడడం కోసం తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన జయశంకర్ పట్టుదలే ఇందుకు నిదర్శనం అని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజు దేవేందర్ మరియు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు, విద్యార్థిని ,విద్యార్థులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.