ఎస్ఎల్బీసి సొరంగానికి నిధులు కేటాయించి, యుద్దప్రతిపాధికన పూర్తి చేయాలి

8.02.2021
నల్గొండ.

సిపిఎం డిమాండ్

ఉమ్మడి జిల్లాలో మూడు లక్షల ఎకరాలకు సాగు త్రాగు నీరు అందించే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు బడ్జెట్లో మూడు వేల కోట్లు నిధులు కేటాయించి ఆగిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలని మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు, సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు .సోమవారం జిల్లా కేంద్రంలోని దొడ్డికొమరయ్య భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు .ఎన్నికల ముందు జిల్లాకు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే అమలుపర్చాలన్నారు .మాటలు చెప్పి కోటలు కట్టడం కాదు చెప్పిన పనులు చేసి చూపించాలని విమర్శించారు .చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయని ఆయన తెలిపారు .ఇప్పుడైనా బిల్లులు చెల్లిస్తే పనులు చేయడానికి కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు .డిండి ప్రాజెక్టుకు డీపీఆర్ చేయలేక పోవడంతో ఇప్పటివరకు భూసేకరణ జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .ఒక లక్ష ఎకరాలకు సాగునీరు అందించే బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం పనులు నిలిచిపోయాయని వెంటనే వెయ్యి కోట్లు నిధులు వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు .ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ నెల పది న హలియాల్లో జరిగే బహిరంగ సభలో స్పష్టత ఇవ్వాలని ..లేని యెడల జరిగే ఉప ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు.
సీపీఐఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేతిలో పట్ల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ వ్యతిరేక చట్టాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకమని ఆలియా వేదికపై కెసిఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.లేని యెడల కెసిఆర్కు రైతులే తగిన గుణపాఠం చెబుతారని ఆయన తెలిపారు .ఐకెపి సెంటర్లను కూడా ప్రభుత్వం ఎత్తివేయాలని ప్రయత్నిస్తుందని దానిపై కూడా సభలో చెప్పాలన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మల వీరారెడ్డి ,బండ శ్రీశైలం ,పాలడుగు నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.