జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్లో గత రెండు సంవత్సరాల క్రితం ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన ఇమ్మడి వీరభద్రరావు శుక్రవారం బదిలీ అయ్యారు. చిట్యాల ఎస్సై గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నిబద్ధతతో వృత్తిపట్ల అంకిత భావంతో విధులు నిర్వర్తించారు. గత సంవత్సరం కరోనా మహమ్మారి దేశ ప్రజలను అతలా కుతలం చేస్తున్న సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి. ప్రభుత్వాల ఆదేశాల మేరకు మండల ప్రజలు రోడ్ల పైకి వచ్చి గుమికూడితే కరోనా బారిన పడే అవకాశం ఉన్నందున అనుక్షణం నిద్రాహారాలు మాని డ్యూటీ చేశారు. తాను కరోనా బారిన పడినా గాని తేరుకోని అలుపెరుగకుండా మండల ప్రజలకు సేవ చేసాడు.పార్టీలకతీతంగా నాయకులను సమానంగా చూసేవారు. మండల ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా వీర”భద్రం” సార్ ఉన్నాడు అన్న భరోసాతో ఉండేవారు. అలాంటి సిన్సియర్ ఆఫీసర్ ఎస్ఐ వీరభద్రరావు బదిలీపై వెళ్లడం చాలా బాధాకరమైన విషయమని మళ్ళీ తిరిగి ఉన్నత అధికారిగా చిట్యాలకు తిరిగి రావాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.