మహబూబూబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్ సహకారంతో మంజూరైన ఎస్ సి కార్పోరేషన్ రుణాల లబ్ధిదారులకు చెక్కులను ఎంపిడిఓ సర్వసతి సోమవారం పంపిణీ చేశారు. ఉపాధి కల్పన కై చేయూత నిచ్చే మహత్తర పథకంఅని, కార్పోరేషన్ రుణాలను సద్వినియోగ పర్చుకుని ఆర్థికంగా ఉన్నత స్థితి కి చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పదకొండు మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి యాభైవేల రూపాయల చొప్పున మొత్తం ఐదులక్షల యాభై వేల రూపాయలు చెక్కుల ను అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు ఎర్రం రెడ్డి సుధాకర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ ముండ్ల రమేష్, టిఆర్ ఎస్ యూత్ రాష్ట్ర నాయకులు గుగులోత్ రవి నాయక్, స్థానిక యం పి టి సి చిన్నం భాస్కర్, టిఆర్ ఎస్ సీనియర్ నాయకులు గాడి పల్లి రాములు,, గుగులోత్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.