భారత దేశ భవితకు దిక్సూచి సిపిఎం అని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న అన్నారు. కేరళ రాష్ట్రంలో కన్నూర్‌లో ఏప్రిల్ 6 నుండి 10వ తేదీ వరకు జరిగే సిపిఎం 23వ అఖిలభారత మహాసభల పురస్కరించుకొనిబుధవారం పాలకుర్తి మండలోని పలు గ్రామాల్లో *పాలకుర్తి.బొమ్మెర. గూడూరుగ్రామాలలోసిపిఎం జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సోమన్న పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత విధానాలను వ్యతిరేకించాలి అన్నారు. ప్రజలు వాడే ప్రతి వస్తువు పైన ధరలు విపరీతంగా పెంచుతూ పెట్రోల్ డీజిల్. గ్యాస్ .ధరలు ఆకాశానికి నిచ్చెనలు వేసినట్లు రోజుకొకసారి పెరుగుతూ సామాన్య ప్రయత్నం చేస్తున్నారని వారన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 సంవత్సరంలో 500 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయలకు చేరిందన్నారు. కోవిడ్ దెబ్బకు అతలాకుతలమైన సామాన్య మధ్యతరగతి ప్రజలు నిత్యావసర ధరలను విలవిలలాడుతున్నారు. అని అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న ధరలను అరికట్టాలని వారన్నారు. రానున్న కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా కార్మిక. రైతు. విద్యార్థి.మహిళల. సమస్యలపై చర్చించి భవిష్యత్ ఉద్యమాలకు రూపకల్పన చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఏరియా కమిటీ సభ్యులు మాచర్ల సారయ్య. సోమ సత్యం నాయకులు ముస్కు ఇంద్రారెడ్డి. బెల్లి సంపత్. గడ్డి సోమన్న. నక్క రాజయ్య. సోమ సాయి. కాకర్ల బాబు. బాణాల వెంకన్న. దండం పల్లి సోమన్న . ఏం రాములు. ఓర్సు లక్ష్మ.ిమన అమ్మ సాయిలు. తదితరులు పాల్గొన్నారు
