ఏబీవీపీ విద్యార్థులపై దాడి చేసిన టిఆర్ఎస్ గుండాలను శిక్షించాలని బీజేవైఎం ఆధ్వర్యంలో రాస్తారోకో

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు ప్రజాస్వామ్య పద్ధతిలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ఎదుట నిరసన తెలుపగా పోలీసులు వారి పై పోలీసులు లాఠీఛార్జి చేసి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు పోలీసు కస్టడీలో ఉన్న ఏబీవీపీ నాయకులపై పై టిఆర్ఎస్ గుండాలు పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసుల సమక్షంలో లో ఏబీవీపీ విద్యార్థులపై భౌతిక దాడులకు పాల్పడాన్నీ ఖండిస్తూ దాడికి పాల్పడిన దుండగులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడు పంజాల సతీష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద కరీంనగర్ వరంగల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం బిజెపి నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం కావడమే కాకుండా, నిరుద్యోగుల ఆర్తనాదాలు వినే ఓపిక లేక మంత్రి కేటీఆర్ తన అనుచరులతో సిరిసిల్ల ఇసుక మాఫియా తో దాడి చేయించడం సిగ్గుచేటని బిజెపి నాయకులు విమర్శించారు. నిధులు, నియామకాలు, ఉద్యోగాలు, నీళ్ల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నేటికీ ఉద్యోగాల్లేక నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్న, టిఆర్ఎస్ ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టలేక మొద్దునిద్ర లో ఉందన్నారు. నిరుద్యోగులను ఆదుకోవాలని కోరుతూ ఇటీవల కాలంలో మంత్రులు ఎమ్మెల్యేల ఎదుట ఏబీవీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం వారిపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడడం శోచనీయం అన్నారు. సోమవారం మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పర్యటన సందర్భంగా ఏబీవీపీ కార్యకర్తలు నిరుద్యోగులను ఆదుకోవాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపడితే, మంత్రి కేటీఆర్ అండదండలు చూసుకొని ఆయన అనుచరులు, ఇసుక మాఫియా రెచ్చిపోయి ఏబీవీపీ కార్యకర్తలపై దాడి చేయడం సమంజసం కాదన్నారు. మంత్రి కేటీఆర్ అండదండలతో టిఆర్ఎస్ కార్యకర్తలు ఏకంగా ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో ఉన్న ఏబీవీపీ కార్యకర్తలపై దాడి చేశారంటే టిఆర్ఎస్ గుండాలను ఎవరు పెంచి ప్రోత్సహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగుల న్యాయమైన హక్కులకోసం పోరాడడం , నిరసన వ్యక్తం చేయడం నేరమా? అని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగులను ఆదుకోవాల్సిందిపోయి వారిని ఆత్మహత్యలు చేసుకునే దౌర్భాగ్య పరిస్థితులు రాష్ట్రంలో తీసుకువచ్చారని వారు విమర్శించారు. సిరిసిల్ల లో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏబీవీపీ కార్యకర్తలు చేసిన తప్పేంటని, మంత్రి కేటీఆర్ తన అనుచరులతో ఇసుక మాఫియాతో పోలీస్ స్టేషన్ లోనే దాడి చేయడాన్ని ప్రజలందరూ గ్రహించారని కోరారు .మంత్రి కేటీఆర్ అండదండలతోనే ఆయన అనుచరులు రెచ్చిపోయి ఏబీవీపీ కార్యకర్తలపై దాడి చేశారని, పోలీసులు కూడా మంత్రి అనుచరుల తీరుతో ఏమీ చేయలేని పరిస్థితి లో ఉండిపోయారని వారు ఆరోపించారు. ఇట్టి సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి దాడి చేసిన టిఆర్ఎస్ గుండాల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు నందగిరి మహేందర్ రెడ్డి, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు పంజాల సతీష్ కుమార్, బిజెపి జిల్లా కార్యదర్శి బింగి కరుణాకర్, జిల్లా అధికార ప్రతినిధి మాట్లాడి ముత్యం రావు, జిల్లా కార్యాలయ కార్యదర్శి మాడుగుల ప్రవీణ్ కుమార్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు తూముల శ్రీనివాస్, ఓ బి సి మోర్చా జిల్లా కార్యదర్శి రావుల వేణు, బీజేవైఎం జిల్లా కార్యదర్శి దామెర అనురాగ్,ఎస్టి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తూర్పాటి రాజు, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి దేవేందర్ రావు, బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి నల్ల సుమన్, ప్రతాప కృష్ణ అంకటి వాసు, బీజేవైఎం ప్రధాన కార్యదర్శులు కొమురవెల్లి సంతోష్ ,భాస్కర్ యాదవ్, ఎస్ సి మోర్చా పట్టణ అధ్యక్షుడు గంగరాజు యువమోర్చా ఉపాధ్యక్షులు పృథ్వి రాజ్,సాల్మన్ రాజు, పవన్ కుమార్,భీమరాజు వెంకట్, సాయి తేజ, బోడ కుర్తి శివకుమార్, తూర్పాటి రాజ్ కుమార్, అభిరామ్, రాజశేఖర్, భూపతి ,కుమార్, తూర్పాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.