MLA ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారిని కలిసి వినతిపత్రం సమర్పించిన Cpm జిల్లా కమిటీ

*

MLA ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారిని కలిసి వినతిపత్రం సమర్పించిన Cpm జిల్లా కమిటీ.

(Cpm జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బోట్ల శ్రీనివాస్.)

జిల్లా అభివృద్ధికి, జిల్లా ప్రజల పరిపాలన సౌకర్యార్ధం జిల్లా కలెక్టర్ కార్యాలయం నిర్మాణం కోసం తమ నివాస స్థలాలను అప్పగించిన ఏసిరెడ్డి కాలనీ వాసులకు బాణాపురంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వారికి అప్పగించి సహకరించాలని Cpm జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జనగామ Mla ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారిని కలసి వినతిపత్రం సమర్పించడం జరిగిందని Cpm జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, Cpm జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బోట్ల శ్రీనివాస్ లు తెలిపారు.

దివి: 20-04-2021మంగళవారం రోజున ఏసిరెడ్డి కాలనీ వాసులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అప్పగించాలని Cpm జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని Mla ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారి నివాసంలో వారిని కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సంధర్బంగా Mla ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు సానుకూలంగా స్పందించారని త్వరలో ఎసిరెడ్డి కాలనీ వాసులకు డబుల్ బెడ్ రూమ్ అప్పగిస్తామని తెలిపారని అన్నారు. అనంతరం Cpm జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి మాట్లాడుతూ జనగామ నూతన జిల్లా ఏర్పాటులో భాగంగా జిల్లా అభివృద్ధికి, జిల్లా ప్రజలకు పాలన సౌలభ్యం కోసం ఎసిరెడ్డి కాలనీ స్థలం సరైందని భావించిన ప్రభుత్వం, జనగామ Mla ముత్తిరెడ్డి యాదగిరెడ్డిగారు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, స్టేషన్ ఘనపూర్ Mla తాటికొండ రాజయ్య గారు, అప్పటి జిల్లా కలెక్టర్ దేవసేన గారు, జిల్లా మేధావులు, కవులు, రచయితలు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు పలుమార్లు ఎసిరెడ్డి కాలనీ వాసులతో చర్చలు జరిపి కాలనీ వాసులు జిల్లా కలెక్టర్ కార్యాలయం కోసం స్థలం అప్పగిస్తే మీకు పునరావాసం క్రింద బాణాపురంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి 6 నెలల్లో ఇచ్చే విధంగా ప్రభుత్వం నుండి హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పటికి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా వారికి ఇండ్లు అప్పగించడం జరగలేదని అన్నారు. ఏప్రిల్ 18న జిల్లా కలెక్టర్ కార్యాలయం పనులను పరిశీలించడానికి వచ్చిన జనగామ Mla ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు మే నెలలో జిల్లా కలెక్టర్ కార్యాలయం సీఎం Kcr చేతుల మీదుగా ప్రారంభం అవుతుందని, దానికి ముందే జిల్లా కలెక్టర్ కార్యాలయంకు వారి నివాస స్థలాలను త్యాగం చేసిన ఎసిరెడ్డి కాలనీ పేదలకు బాణాపురంలో వారికోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వారికి త్వరలో అప్పగిస్తామని చెప్పి, ఎసిరెడ్డి కాలనీ పేదప్రజల కష్టాలను, కరోనా పరిస్థితులను అర్ధం చేసుకున్న జనగామ Mla ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారికి Cpm జనగామ జిల్లా కమిటీ పక్షాన ధన్యవాదములు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కమిటీ సభ్యులు Md.దస్తగిరి తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.