మునగాల న్యూస్.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని చూచించింది. కొనుగోలు కేంద్రంలో రైతులనుంచి ధాన్యం కొని మిల్లులకు పంపించగా మిల్లర్లు మాత్రం వాటిని వంకలు చెప్తూ రోజులు తరబడి నిలవ ఉంచుతున్నారు. వేరు వేరు మిల్లులకు తిప్పుతూ గిట్టుబాటు ధర రాకుండా తక్కువ ధరకు అమ్మేలా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కొన్ని మిల్లులో సన్నాలు కొనకపోగా,మరి కొన్ని మిల్లులో దొడ్డు రకం కొనకపోవడం జరుగుతుంది. ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాలకు వచ్చి ధాన్యాన్ని కొని రేట్ చెప్పాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని రకం ధాన్యాన్ని ఐకేపీ కేంద్రంలో కొనుగోలు చేయకపోవడం గమనార్హం.