కురవి ఎంపీపీ గుగులోతు పద్మావతిరవినాయక్, మానుకోట వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ బజ్జురి ఉమాపిచ్చిరెడ్డి

ఈ రోజు కురవి మండలంలోని గుండ్రాతిమడుగు పెద్ధతండా,అయ్యగారిపల్లి, మొదగులగూడెం గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కురవి ఎంపీపీ గుగులోతు పద్మావతిరవినాయక్, మానుకోట వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ బజ్జురి ఉమాపిచ్చిరెడ్డి
ఈ సందర్భంగా జరిగిన సమావేశాలలో వారు మాట్లాడుతూ కేసీఆర్ గారి ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షపాతి ప్రభుత్వం అని అన్నారు. దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న కూడా రైతులను కడుపులో పెట్టి కాపుడుతున్న కేసీఆర్ గారికి రైతులందరు ఋణపడి ఉండాలని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆశ్చర్య పోయే విధంగా కేసీఆర్ గారు రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి,రైతుకు పెద్ద పీట వేశారని అన్నారు. సమైఖ్య రాష్ట్రంలో రైతులు అన్నమొ రామచంద్ర అని ఆకాశం వైపు చూసేది, కానీ నేడు నడి ఎండాకాలం లో చెరువులు అలుగులు పోస్తున్నాయని,ఆ ఘనత కేవలం కేసీఆర్ గారికే దక్కిందన్నారు.రైతులకు 24 ఘంటల కరెంట్,పెట్టుబడికి సహాయం పేరిట రైతుబందు,రైతు భీమా,పండిన పంటను గ్రామాల్లోనే కొనుగోలు చేయడం వంటి అనేక కార్యక్రమాలు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని అన్నారు.
డోర్నకల్ నియోజకవర్గ ములో ఎమ్మెల్యే రెడ్యానాయక్ గారు చివరి ఆయకట్టు వరకు కాళేశ్వరం జలాలు తీసుకొచ్చి మన రైతుల రుణం తీర్చుకున్నారని అన్నారు. గ్రామ గ్రామాన రోడ్లు వేయించి అభివృద్ధికి బాటలు వేశారని అన్నారు. ఎమ్మెల్యే రెడ్యానాయక్ గారికి,కేసీఆర్ గారికి మనం జీవితంలో ఎల్లప్పుడూ రుణపడి ఉండాలని అన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి అవినీతి కి ఆస్కారం లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు చేయాలని అన్నారు. దళారుల ప్రేమేయం ఉండకుండా,రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మరిపెడ డివిషన్ ఆత్మ చైర్మన్ తోట లాలయ్య, TRS జిల్లా నాయకులు బజ్జురి పిచ్చిరెడ్డి, ఆలయ ఛైర్మన్ బాదవత్ రామునాయక్, వైస్ ఎంపీపీ దొంగలి నర్సయ్య,TRSV జిల్లా అధ్యక్షులు గుగులోతు రవినాయక్,సర్పంచ్ లు బజ్జురి జ్యోష్ణ వెంకట్ రెడ్డి,ఎంపీటీసీ భోజ్య నాయక్, DPM చంద్రశేఖర్, AO మంజుఖాన్,APM కిరణ్ కుమార్,మండల vo అధ్యక్షులు లావణ్య,మండల సోషల్ మీడియా ఇంచార్జ్ బాణోత్ రమేష్, గుగులోతు లక్ష్మణ్,గాడిపల్లి రాములు,దేవేందర్ రెడ్డి,శ్రీశైలం, వెంకట మల్లు,నరహరి,ఆయా గ్రామాల పార్టీ నాయకులు,కార్యకర్తలు, ఐకెపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.