ఓట్ల కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్న బిజెపి ఎమ్మెల్యే చల్లా

పట్టభద్రుల ఓట్ల కోసం బిజెపి పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
ఉత్తముడైన తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను అభ్యర్థించారు.

గురువారం పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారలో భాగంగా ఏర్పాటుచేసిన సమావేశలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి నయాపైసా నిధులివ్వని మోదీ ప్రభుత్వం.
రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్న బిజెపి పార్టీ ఓటు అడిగే హక్కులేదన్నారు.తెలంగాణ ప్రజలకు ఏంచేశారని ఓట్లడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బిజెపి అడ్రస్ గల్లంతు అవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో పరకాల మండల మరియు వెల్లంపల్లి గ్రామల నాయకులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.