ఓ.సి జె.ఎ.సి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా భూపాలపల్లి మండలం రాంపూర్ గ్రామ నివాసి

ఓ.సి జె.ఎ.సి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా భూపాలపల్లి మండలం రాంపూర్ గ్రామ నివాసి డా.సామల శశిధర్ రెడ్డి నియామకం తెలంగాణ రాష్ట్ర ఓసి జెఎసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా రాంపూర్ గ్రామానికి చెందిన డా.సామలశశిధర్ రెడ్డిని నియమించినట్లు ఓ.సి. జెఎసి జాతీయ అధ్యక్షులు నల్ల భాస్కర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాల్లో ఇస్తున్నటువంటి 10 శాతం రిజర్వేషన్ కొరకై తెలంగాణ రాష్ట్రంలో ఈ.డబ్ల్యూ.ఎస్ అమలు అనే సమావేశానికి ముఖ్యఅతిథిగా ఓ.సి జేఏసి జాతీయ అధ్యక్షులు నల్ల భాస్కర్ రెడ్డి గారు హాజరై మాట్లాడుతూ భారతదేశంలోని మిగతా రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ డబ్ల్యూ ఎస్ 10 శాతం రిజర్వేషన్ ఒక తెలంగాణ రాష్ట్రం లోనే అమలు చేయకపోవడం వల్ల దాదాపు 70 వేల మంది ఓసి పేద విద్యార్థులకు ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయం తీవ్ర నష్టం జరిగిందని రాబోయే రోజుల్లో ఓసి పేద విద్యార్థులకు ఎటువంటి నష్టం జరగకుండా ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే తక్షణమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ డబ్ల్యూ ఎస్ 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.