కడపత్రాన్ని ఆవిష్కరిస్తున్న బీసీ నేతలు దేశవ్యాప్తంగా ఉన్న బీసీలను కులగణన చేయాలి

తక్షణమే బీసీ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి.

-హలో బిసి ఛలో ఢిల్లీ కరపత్రం ఆవిష్కరణ

  • తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు శని కృష్ణ చిన్న గూడూరు ఆగస్టు 6 : దేశవ్యాప్తంగా ఉన్న కులాల్లో

సింహ భాగం ఉన్న బీసీలను కులగణన చేయాలని డిమాండ్ చేస్తూ

ఆగస్టు 9, 10 తారీకులలో తెలంగాణ బీసీ సంక్షేమ ఆధ్వర్యంలో చేపట్టే

హలో బీసీ, ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ

బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దేశ గాని కృష్ణ కోరారు. శనివారం

స్థానిక మండల కేంద్రంలోని దాశరధి సెంటర్లో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీలు 60 శాతం ఉంటే కేవలం 27% అమలు చేస్తూ దానిలో కేవలం 15% రిజర్వేషన్లను పాలకులు అమలు చేస్తూ బిసీ ల ఓట్లు దండకుంటున్నారని దుయ్యబట్టారు. చట్టసభల్లో బిసీలకు విద్యా, ఉద్యోగ రంగాలలో సముచితమైన ప్రాధాన్యం కల్పించి 50శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని, క్రిమిలేయర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జనాభాలో సింహభాగం ఉన్న బీసీలకు వాటా దక్కకుండా హక్కులను పాలకులు కాలరాస్తూ విద్యా, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో వివక్షత చూపుతున్నారని మండిపడ్డారు. చేయాలని 75 సంవత్సరాలుగా పాలకులు ఇదే తంతును కొనసాగిస్తూన్నారని విమర్శించారు. ఇదేవిధంగా పాలకులు బీసీలను విస్మరిస్తే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాల్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు పసునాడు విజయ్, సూదగాని కృష్ణ గౌడ్, చిత్తారి కళ్యాణ్, దాసరి ఉమేష్, గాడి పెళ్లి రవి, సాయి తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.