kadiyam srihari news

ఈ69న్యూస్ జఫర్ఘడ్ జులై 11

జఫర్ గఢ్ మండలం అల్వార్ బండతండా లోనిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన జాటోతు దేశ్యా కుమారుడు శ్రీను కోవిడ్ సోకడంతో తనకు ఉన్న ఎకరం భూమిని అమ్ముకొని హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందారు.దాదాపు 16 లక్షల రూపాయలు ఖర్చయ్యాయి.చికిత్స అనంతరం ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని కలిసి తన బాధను చెప్పుకోగా కడియం నేరుగా సీఎం దగ్గరకు వెళ్లి తన ప్రత్యేక నిధుల నుండి 3లక్షల రూపాయలు మంజూరు చేయించి ఇచ్చారు.శ్రీను కుటుంబ సభ్యులు కడియం శ్రీహరిని వారి నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో బానోతు రాజేష్ నాయక్ స్థానిక సర్పంచ్ బానోత్ తులసి, ఎంపీటీసీ దేవేందర్, ఉపసర్పంచ్ రంగమ్మ వార్డ్ నంబర్లు స్వామి రాంసింగ్ లింభా బలరామ్ కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.