కదం తొక్కి కదలివచ్చిన మహిళా లోకం

స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి పిలుపు మేరకు మరో ఉద్యమ హోరు సాగించిన సూర్యపేట

  • కదం తొక్కి కదలివచ్చిన మహిళా లోకం
  • గ్యాస్ సిలిండర్ నెత్తిన పెట్టుకొని మహిళల్లో ఉత్సాహం నింపిన మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్
  • పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలంటూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసిన తెరాస నాయకురాళ్ళు

ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తూ ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తున్నా బిజెపి కేంద్ర ప్రభుత్వంపై మహిళా లోకం కన్నెర్ర చేసింది….రెండేండ్లుగా కరోనా ఉధృతికి ఛిన్నాభిన్నమైన ప్రజలకు చేదోడు వాదోడుగా నిలిచి చేరిపోయి అమాంతం ధరలు పెంచి కర్కశత్వం చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై మహిళలంతా మరో ఉద్యమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రసమితి ఇచ్చిన పిలుపు మేరకు సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామ గ్రామాన మహిళలు కదం తొక్కి సూర్యాపేటకు తరలి వచ్చారు
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ ప్రారంభించి కొత్త బస్టాండ్ వద్ద వంటావార్పు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ ఆందోళనకు వచ్చిన మహిళల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. సిలిండర్ నెత్తిన పెట్టుకుని ర్యాలీలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరిగారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కరోన ఉద్ధృతిలో ప్రజల పరిస్థితి అధ్వానంగా మారిందని ఈ తరుణంలో కేంద్రం ధరల పెంపు వారికి తలకు మించిన భారం అన్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపుతో ఎన్ని రకాల నిత్యావసరాల వస్తువుల ధరలు కూడా జరిగే అవకాశం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ సంక్షేమ పథకాలకు లోటు లేకుండా ప్రజలకు ఎప్పుడు ఏం కావాలో తెలుసుకొని చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి కి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించకపోగా ఇలా ధరలు పెంచి కర్కశత్వం చూపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో మహిళా లోకం అంతా ఏకమై కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ శ్రీమతి ఉప్పల లలిత ఆనంద్, జెడ్పిటిసి అనిత, ఎంపీపీ కుమారి, ఆత్మకూరు ఎంపీపీ స్వర్ణలత రెడ్డి, సూర్యాపేట పట్టణ కౌన్సిలర్లు స్రవంతి, కవిత, పావని, రేణుక, శ్రీవిద్య, లక్ష్మీకాంతమ్మ, కమల, లక్ష్మి, సౌమ్య, అరుణ, సూర్యాపేట నియోజకవర్గ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు రాంబాయమ్మ, మాణిక్యమ్మ, కరుణశ్రీ, దండు రేణుక, రాచూరి రమణ, సల్మా, మహేశ్వరి, విజయ, ఢిల్లీ పావని, అంజమ్మ, సూర్యాపేట పట్టణ టిఆర్ఎస్ పార్టీ మహిళ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.