suryapet news

కొత్తపల్లి శివకుమార్
సీపీఐ (ఎం.ఎల్) ప్రజా పంథా జిల్లా కన్వీనర్

సూర్యాపేట పట్టణం లోని 30, 33 వార్డ్స్ లతో పాటు సద్దల చెరువు ట్యాంక్ బండ్ బతుకమ్మలు ఆడే దగ్గరి నుండి హైవే వరకు ఉన్న మురికి కాలువ రెండు పక్కల చెత్త, చెదారం మురికి నీటితో నిండి దుర్గంధం వెదజల్లుతూ అక్కడ నివసిస్తున్న ప్రజలు అక్కడే ఉన్న ప్రభుత్వ ప్రేమరీ స్కూల్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు మున్సిపాలిటీ వారు వెంటనే స్పందించి ఇక్కడి సమస్యలు పరిష్కరించాలని   సీపీఐ ప్రజా పంథా జిల్లా కన్వీనర్ కొత్తపల్లి శివకుమార్ ప్రభుత్వాన్ని కోరారు.శుక్రవారం 31వార్డులో ఉన్న ప్రభుత్వ పాఠశాల వద్ద విద్యార్థుల తో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 
గత నెల రోజుల క్రితం ఇదే సమస్యపై స్వయంగా  మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకవెళ్లగా  కాలువలోని చెత్త తీసి పక్కన వేశారు తప్ప వాటిని మునిసిపల్ సిబ్బంది తీసుకవేళ్లలేదని తెలిపారు. గత 3 రోజులుగా  కురిసిన వర్షాల వల్ల తిరిగి చెత్త మళ్ళీ  కాలువలో కి చేరిందని దీంతో అక్కడి ప్రజలు, స్కూల్ పిల్లలు,ఉపాధ్యాయులు దుర్గంధం తో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అంతే కాకుండా  అక్కడ అనేక సంవత్సరాల నుండి ఖాళీ స్థలాలు అలాగే ఉండడంతో అందులో  నీరు నిలువ ఉండి పందులు స్వైర విహారం చేస్తున్నాయని తెలిపారు. ఇదే విషయం గతంలో పలు దినపత్రికలో  వచ్చినా మునిసిపాలిటీ వారు  నేటి వరకు ఆ సమస్యని పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.పట్టణం లో పట్టణ ప్రగతి పేరుతో సమస్యలన్నీ పరిష్కరించి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారే తప్ప ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నదని తెలిపారు. ముఖ్యంగా  30,33  వ వార్డుల్లో చెరువు కట్ట పక్కన ఉన్న ప్రజలు నిత్యం దుర్గందం, దోమలతో ఇబ్బందులు పడుతున్నారని,ఇది వర్షాకాలం సీజన్ కావడంతో అనారోగ్యం బారిన పడే అవకాశం ఉన్నందున  మంత్రి  స్పందించి మున్సిపల్ కమిషనర్  మునిసిపల్ సిబ్బందిని యుద్ధ ప్రాతపదికన ఇక్కడి సమస్యలు పరిష్కరించెలా చేయాలని కోరారు. లేనియెడల మా పార్టీ తరఫున మున్సిపాలిటీ ఆఫీసు ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు జిల్లా కన్వీనర్ కొత్తపల్లి రేణుక, పి డి ఎస్ యు అధ్యక్ష కార్యదర్శులు ఎర్రా అఖిల్, పొన్నూరు సింహాద్రి జిల్లా నాయకులు దొంతమల్ల రామన్న, ఐఎఫ్టియు జిల్లా కన్వీనర్ రామోజీ, జహంగీర్, పద్మ ,వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.