కమిషనరేట్ పోలీసుల వనితీరు బాగుంది-హోంమంత్రి

శాంతి భద్రతలను పరిరక్షించడంలో వరంగల్ కమిషనరేట్ పోలీసుల పనితీరు బాగుందని రాష్ట్ర హోంమంత్రి తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయమును తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మంగళవారం సందర్శించారు. ఈ రోజు ఉదయం వరంగల్ పోలీస్ కమిషనరేటకు చేరుకున్న హోంమంత్రికి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి మొక్కను అందజేయగా సాయుధ పోలీసులు గౌరవవందనం చేసి హోంమంత్రి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి డిసిపిలు, అదనపు డిసిపిలు, ఏసిపిలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా పోలీస్ కమిషనర్ వరంగల్ కమిషనరేట్ పోలీసుల పనితీరుతో పాటు, శాంతి భద్రతలు, నేరాల కట్టడి, మహిళల భద్రత, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు వరంగల్ కమిషనరేట్ పోలీసులు తీసుకుంటున్న చర్యలతో పాటు, ఫ్రెండ్లీ పోలీసింగ్ లో
భాగం చేపడుతున్న కార్యక్రమాలతో పాటు, సిబ్బంది సంక్షేమం కోసం చేపడుతున్న ప్రణాళికలపై వరంగల్ పోలీస్ కమిషనర్ పవర్ పాయింట్ విధానంతో హోంమంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా హోంమంత్రి అధికారులను ఉద్యేశిస్తూ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రెండ అతి పెద్దనగరమైన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణతో పాటు, శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా వున్నాయని, ప్రస్తుతం దేశంలోనే తెలంగాణ పోలీసులే బెస్ట్ పోలీసులు గుర్తింపు లభించిందని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం ప్రజలు ధైర్యంగా పోలీసు స్టేషన్లకు వస్తున్నారని, ప్రజలు, పోలీసుల మధ్య స్నేహపూర్వకమైన వాతవరణం ఏర్పడం జరిగిందని. ముఖ్యంగా పోలీసులు ప్రజలు మరింత చేరువయ్యేందుకుగాను ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా వరంగల్ కమిషనరేట్ పోలీసులు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని, అదే విధంగా యువత మత్తు పదార్థాల భారీనపడకుండా గంజాయి క్రయ విక్రయాలను కట్టడి చేయడంలో వరంగల్ కమిషనరేట్ పోలీసుల పనితీరు ప్రశంసనీయమని, అలాగే మత్తుపదార్థాలను వినియోగించే యువతకు తెలంగాణ నయా కిరణ్ కార్యాక్రమాన్ని ద్వారా వారిని సాధారణ స్థితికి తీసుక రావడం సాధరణ విషయం కాదని తెలియజేసారు.
అనంతరం హోంమంత్రి మరియు పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పోలీస్ అమరవీరుల స్మృతివనంలోన మొక్కనాటడంతో పాటు, కమిరనరేట్ కార్యాలయములో నూతనంగా నిర్మిస్తున్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ భవన నిర్మాణ పనులను హోంమంత్రి పరిశీలించడంతో పాటు, నూతన భవనం నిర్మాణంలో ఏవిధమైన వసతులను కల్పించడం జరుగుతుందని సంబంధిత గుత్తేదారులు, పోలీస్ హౌసింగ్ బోర్డ్ ఇంజనీర్లను హోంమంత్రి అడిగి తెలుసుకోవడంతో పాటు, త్వరితగతిన భవన నిర్మాణం జరగాలని అధికారులకు సూచించారు. హోంమంత్రిని కలిసిన జిల్లా అధికారులు;
వరంగల్ కమిషనరేట్ కార్యాలయమునకు వచ్చిన హోంమంత్రిని వరంగల్, హన్మకొండ, రాజీవ్ గాంధీ హనుమంతు, గోపి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్యలు మర్యాదపూర్వకం కలుసుకోని పుష్పాగుచ్చాలు అందజేసారు..
ఈ కార్యక్రమములో డిసిపిలు అశోక్ కుమార్, వెంకటలక్ష్మీ, సీతారాం, అదనపు డిసిపిలు వైభవ్ గైక్వాడ్, భీంరావు, సంజీవ్, రాగ్యానాయక్, ట్రైనీ ఐపిఎస్లు పంకజ్,సంకీర్త్ పోలీస్ హౌసింగ్ బోర్డ్ ఈ.ఈ శ్రీనివాస్,డి.ఈ దేవేందర్, ఎ.ఈ దమురుకేశ్వర్ తో పాటు ఏసిపిలు, ఆర్.ఐలు ఇనెన్స్ స్పెక్టర్లు, ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.