కరీంనగర్ జిల్లాలో విజయవంతమైన రాష్ట్ర క్షౌరశాలల బంద్

కార్పొరేట్ సెలూన్స్ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా క్షౌరశాలల బంద్ లో భాగంగా నేడు కరీంనగర్ లో పెద్దఎత్తున విజయవంతమైన క్షౌరశాలల బంద్

ఈ సందర్భంగా కరీంనగర్ లో బంద్ లో పాల్గొన తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ నాయీబ్రాహ్మణ ఐక్య కార్యచరణ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా నాయీబ్రాహ్మణులు పెద్దఎత్తున తమ సెలూన్స్ దుకాణాలు బంద్ చేయడం జరుగుతుందని, గత ఇరవై నాలుగు రోజులుగా మంచిర్యాల జిల్లాలో కార్పొరేట్ సెలూన్ వ్యతిరేకంగా అక్కడ నాయీబ్రాహ్మణులు పోరాటం చేస్తున్నారని మాకు పుట్టుకతో వచ్చిన అటువంటి ఈ వృత్తిలోకి ఇతర కులాల వారు వచ్చి మా పొట్ట కొడుతున్నారని వారు అన్నారు
మా పూర్వికుల నుండి ఈ వృత్తిని నమ్ముకొని ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఆదారపడి జీవిస్తున్నారని కానీ ఈ కార్పొరేట్ సెలూన్స్ వలన రానున్న రోజులలో నాయీబ్రాహ్మణులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయని వారు అన్నారు ఈరోజు ఈ కులవృత్తి పైన మాకు భద్రత కల్పించాలని ఈ వృత్తిలోకి ఇతర కులాల వారు రాకుండ ప్రత్యేకమైన జీవో ను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవ్వాలని వారిని కోరడం జరిగిందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక జిల్లా అద్యకా కార్యదర్శులు జంపాల నర్సయ్య, సింగిరాల వెంకటస్వామి, రాష్ట్ర కళ్యాణ కట్టల అద్యక్షులు రాచమల్ల కిషన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శావనపల్లి రాజు, గర్షకుర్తి రాజశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు నాగవేళ్ళి సత్యనారాయణ, గడ్డం అంజన్న, గుంజపడుగు మహేందర్, జంపాల బిక్షపతి, జిల్లా కార్యదర్శులు సమ్మేట లక్ష్మణ్, నడిగొట్టు కుమార్, కడారి శంకర్, శ్రీరాముల శ్రీనివాస్, జనగామ సురేష్, గర్షకుర్తి విద్యాసాగర్, నగర అద్యక్షులు గుంజపడుగు ఓంప్రకాష్, గుంజపడుగు పవన్, శ్రీరాముల రమేష్, గడ్డం రాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు
ఈ బంద్ కార్యక్రమానికి జిల్లా రజక సంఘం జిల్లా అద్యక్షులు దుబ్బాక రమేష్, రజక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పూసల శ్రీకాంత్, జక్కనపల్లి శంకర్ మరియు డ్రాయిక్లీనింగ్ గౌరవ అద్యక్షులు శ్రీనివాస్ తదితరులు సంఘిభావం ప్రకటించారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.