కరెంట్ షాక్ తో పాడి ఆవు మృతి

వరంగల్ రూరల్ జిల్లా
తేది 31/12/2020


ఆత్మకూర్ మండలంలోని మల్కపేట గ్రామంలో కరెంటు ట్రాన్స్ఫార్మర్ షాక్ తో పాడి ఆవు మృతి చెందినట్లు బాధితుడు జల్లెల రమేష్ తెలిపారు.

ఆయన కథనం ప్రకారం కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్కో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ట్రాన్స్ఫార్మర్ కిందనే ఏర్పాటుచేయడంతో ప్రమాదం జరిగిందని వాపోయాడు

దాదాపు 70 వేల రూపాయల విలువ చేసే పాడిఆవు కరెంట్ షాక్ తో మృతి చెందడంతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంలో అశ్రద్ధ చేయడం వల్ల పశువులు చనిపోతున్నాయి అని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాన్స్ఫార్మర్ను సరైన ఎత్తులో ఏర్పాటు చేస్తే ప్రమాదం తప్పదని గ్రామస్తులు వివరించారు నష్టపోయిన తమకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధితుడు రమేష్ జిల్లా అధికారులను కోరారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.