కరోనా టీకాలు సద్వినియోగం చేసుకోవాలి

నడిగూడెం మండల పరిధిలోని 12 నుంచి 14 సంవత్సరాల చిన్నారులు కర్భివాక్స్ ప్రత్యేక టీకాను ప్రతి ఒక్కరూ వేసుకోవాలని నడిగూడెం మండల ఎంపిపి యాతాకుల జ్యోతి బాబు , వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీప్రసన్నలు తల్లిదండ్రులను కోరారు. శనివారం నాడు నడిగూడెం లోని స్థానిక గురుకుల పాఠశాలలో చిన్నారులకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యాతాకుల జ్యోతి బాబు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, కరోనా కట్టడి కోసం ఆరోగ్య శాఖ ఎంతగానో కృషి చేస్తుందని వారికి ప్రజలు సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు. మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వాములై తమ గ్రామంలోని చిన్నారులకు టీకాలు వేసే విధంగా చూడాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి టీకాలు వేసుకోవాలని అన్నారు. 28 రోజుల వ్యవధితో రెండు డోసుల ఈ టీకాలు వేసుకోవడం వల్ల కరోనా నుంచి రక్షణగా ఉంటుందని అన్నారు. ఎం పి డి ఓ ఎర్రయ్య మాట్లాడుతూ గ్రామాలలో సిబ్బంది సమన్వయం చేసుకుంటూ అందరూ టీకాలు వేసుకుని అలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది కి టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బాణాల కవిత నాగరాజు, స్థానిక సర్పంచ్ గడ్డం నాగలక్ష్మి మల్లేష్ యాదవ్, ఉప సర్పంచ్ నజీమా , ప్రిన్సిపాల్ ఆకుల బిక్షమయ్య , కళావతి, రాధా, విజయ్ కుమారి, మహేశ్వరి, లక్ష్మి, సునీత , విజయలక్ష్మి, బాలలలిత , మూర్తి , వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.