కరోనా విజృంభిస్తున్న వేల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కరోనా విజృంభిస్తున్న వేల ప్రజలు అప్రమత్తంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్టేషన్ ఘనపూర్ ఏసీపీ గైక్వాడ్ వైభవ్ అన్నారు. జనగామ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన స్టేషన్ ఘనపూర్ లో ప్రజలకు కరోన నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ మాస్క్ లేకుండా బయటకు రావద్దని,గుంపు గుంపులుగా తిర్గవద్దని, సానిటీజర్ ఉపయోగించాలని తెలిపారు. నిత్యావసర సరుకులను కొనేందుకు బయటకు వచ్చిన ప్పుడు లేదా ఇతర షాపుల కు వెళ్ళినప్పుడు 3 ఫీట్ల సామాజిక దూరం పాటించాలని,షాప్ యాజమాన్యం వారు ముఖ్యంగా షాప్ దగ్గరికి వచ్చే ప్రజలకి తెలియజేసి వారిని పాటించేవిధంగా చూడాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ సనిటైజర్,మాస్క్, ఉపయోగించి కరోనా నుండి తమరిని తాము కాపాడుకోవాల్సిందిగా కోరారు. నిబంధనలు అతిక్రమించి న వారికి తగిన జరిమానా విధించ నున్నట్ల వివరించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ గైక్వాడ్ వైభవ్, సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ లు రమేష్ నాయక్, మోహన్ బాబు, చిల్పూర్ ఎస్ ఐ మహేందర్, ఏఎస్ఐ రవీందర్,డాక్టర్ శ్రీ లక్ష్మి పీసీలు లక్ష్మణ్,కుమార్, గోవర్ధన్,మోహన్,కుమార్. యాకయ్య మహిళ పీసీలు సుకన్య ,శ్రీజ, నర్మదా తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.