కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసిన ఎంపిపి -సుదర్శన్

E69 news:-జగామ జిల్లా జఫర్గడ్ మండలం కేంద్రం లోని ప్రభుత్వ హాస్పిటల్ లో మరియు కునూర్ గ్రామంలోని పి హెచ్ సి లో తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే డా.తాటికొండ రాజయ్య ఆదేశానుసారం కరోన వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీపీ రడపాక సుదర్శన్, జడ్పీటీసీ ఇల్లందుల బేబిశ్రీనువాస్ ప్రారంభించారు.ఎంపీపీ మాట్లాడుతూ ప్రపంచం మొత్తాన్ని గడగడ లాడించిన కరోన మహమ్మారికి మన దేశంలోనే వ్యాక్సిన్ కనుకొని ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయడం చాలా గర్వకారణం అన్నారు. అదే విధంగా కార్యక్రమంలో నియోజకవర్గ తెరాస కో ఆర్డినేటర్ గుజ్జరి రాజు, మండల పార్టీ అధ్యక్షుడు పసునూరి మహేందర్ రెడ్డి, కునూర్ సర్పంచ్ ఇల్లందుల కుమార్, జఫర్గడ్ 1&2 ఎంపీటీసీలు జ్యోతి రజితయాకయ్య, ఇల్లందుల స్రవంతి మొగలి,కునూర్ ఉప సర్పంచ్ యాదనాల మంజులక్రాంతి,ఎంపీడీవో శ్రీధర్ స్వామి,ఎలక్ట్రికల్ ఎ ఇ, డాక్టర్.రాజు, డాక్టర్ భజన్ లాల్, జఫర్గడ్ 1&2 గ్రామ శాఖ అధ్యక్షులు సింగారపు శ్రీధర్,కుల్లా రాజు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.