మరిపెడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రములో ఈ రోజు మరిపెడ ఎంపీపీ గుగులోతు అరుణ రాంబాబు నాయక్ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది.కరోనా వ్యాక్సిన్ పై ప్రజలు ఎలాంటి భయానికి గురి అవ్వద్దు అని 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని మండల ప్రజలను కోరారు.అందరూ మాస్క్ ధరించాలని మరియు భౌతిక దూరం పాటించాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసి శారద రవీందర్ నాయక్,మునిసిపల్ చైర్మన్ సింధురా బాలిని ధర్మారం సర్పంచ్ దార ఆనంద్ డాక్టర్ అరుణదేవి ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.