కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెల్పిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెల్పిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
పెంచిన నిత్యావసర సరుకుల ధరలు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలి
ములుగు నియోజక వర్గం లో ఇటీవలే కురిసిన వర్షాలకు ముంపుకు గురైన బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం అందించాలి డబుల్ బెడ్ రూం మంజూరు చేయాలి
పంట నష్ట పరిహారం అందించాలి
ఏఓ కు వినతి పత్రం అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఈ రోజు AICC ఆదేశాల మేరకు TPCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారి ఆధ్వర్యములో కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెల్పిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
ఈ సందర్భంగా టిపిసిసి అధికార ప్రతినిధి రవళి రెడ్డి జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారు మాట్లాడుతూ
బిజెపి కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ పేద మధ్యతరగతి కుటుంబాలపై పెనుభారం మోపుతూ పాలు పెరుగు నూనెలు పప్పు ఉప్పుతో పాటు గ్యాస్, డిజీల్ , పెట్రోల్ తో పాటు ఇతర నిత్యావసర సరుకుల పై విధిస్తున్న GST ధరలు పెంచి పేదల పొట్ట కొడుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కు ప్రజలే బుద్ది చెపుతారు అని అదే విధంగా జిల్లా లో ఇటీవలే కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి వరుద ఉదృతి మూలాన పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది ఇండ్లు పూర్తి స్థాయిలో నేలమట్టం కావడం జరిగిందని బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్ రూం తో పాటు తక్షణ సాయం 25 వేలు ఇవ్వాలనీ రైతుల పంట పొలాలో ఇసుక మేటలు పెట్టీ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది పంట నష్టాన్ని అంచనా వేసి నష్ట పరిహారం చెల్లించాలని లేఖ లో పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, టిపిసిసి అధికార ప్రతినిధి రవళి రెడ్డి
ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి కుమారుడు సూర్య గారు
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య,జెడ్పీటీసీ నామా కరం చంద్ గాంధీ,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,సహకార సంఘం చైర్మన్ పాన్నాల ఎల్లారెడ్డి
మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండీ అయిభ్ ఖాన్,మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కొమురం ధన లక్ష్మి,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్,మండల అధ్యక్షులు చిటమట రఘు, చెన్నోజు సూర్య నారాయణ,ఎండీ అఫ్సర్ పాషా,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు సీతారాం నాయక్,ఫిషర్ మెన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి
ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి కోటి
తో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల సీనియర్ నాయకులు
అనుబంధ సంఘాల జిల్లా మండల అధ్యక్షులు ఎంపీటీసీ లు సర్పంచులు మాజీ ఎంపీపీ లు సర్పంచులు,సహకార సంఘం చైర్మన్ లు ఎంపీటీసీలు
తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.