కలెక్టర్ కార్యాలయం ముందు కళ్లెం భూ నిర్వాసితులు ధర్నా

కలెక్టర్ కార్యాలయం ముందు కళ్లెం భూ నిర్వాసితులు ధర్నా
తక్షణంభూనిర్వాసితులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి డిమాండ్
లింగాల గణపురం మండలం కళ్లెం గ్రామంలో కామోజీ టెక్స్టైల్స్ పార్క్ కోసం గత ప్రభుత్వం రైతుల నుండి భూమి భూమి సేకరించిన సంగతి తెలిసిందే ఇందులో కొంత మంది వాస్తవ రైతులకు నష్టపరిహారం అందలేదని తమకు నష్టపరిహారం ఇవ్వాలని గత అనేక సంవత్సరాలుగా జిల్లా అధికారులకు రెవిన్యూ డివిజనల్ అధికారికి తాహాల్దార్ గారికి విన్నవించుకుని వినతి పత్రం ఇచ్చిన సర్వే నిర్వహించి బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని విమర్శించారు.
అలాగే దేవాదుల కాలువ నిర్మాణం లో భూమి కోల్పోయిన రైతులకు కూడా నష్టపరిహారం రాలేదని వారికి కూడా వెంటనే ఇవ్వాలని దీనితోపాటు గ్రామంలో 456 సర్వేనెంబర్ యాక్టర్ల గడ్డ భూమిలో గత ప్రభుత్వం sc బేడ బుడగ జంగం కులాల పేదలకు 8-20 గంటలలో పట్టాలు ఇస్తే అట్టి భూమిని అదే గ్రామానికి చెందిన మజ్జిగ సత్తయ్య మజ్జిగ హంస మజ్జిగ రామయ్య స్థానిక తహసీల్దార్ను అధికారులను కలుపుకొని అక్రమ పట్టా చేయించుకున్నారని ఇట్టి విషయం ఉన్నత అధికారుల దృష్టికి తీసుకు పోతే సర్వే నిర్వహించినప్పటికీ అవినీతి అక్రమాలకు పాల్పడ్డ ఎమ్మార్వో తప్పుడు పద్ధతిలో బాధిత రైతులకు అన్యాయం చేస్తున్నాడని ఈ విషయమై జిల్లా కలెక్టర్ గారు సమగ్ర విచారణ జరిపి పేద రైతులకు న్యాయం చేయాలని అలాగే అక్రమాలకు పాల్పడుతున్న లింగాల గణపురం తహసీల్దార్ శ్రీనివాసులు పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈకార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డు కరుణాకర్ కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు తుటి దేవదానం కెవిపిఎస్ కళ్లెం గ్రామ శాఖ అధ్యక్షులు మబ్బు ఉప్పలయ్య సిరిగిరి కిష్టయ్య చింతల మల్లయ్య మబ్బు బిక్షపతి ముగ్గు పోచయ్య మేడ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.