ఈ రోజు మరిపెడ మండల కేంద్రంలోనీ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి,శాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో డోర్నకల్ శాసన సభ్యులు శ్రీ డిఎస్ రెడ్యా నాయక్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మరిపెడ మండలం, నర్సింహులపేట మండలాల లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ శ్రీ గుడిపూడి నవీన్ రావు గారు ఎంపీపీ గుగులోతు అరుణ రాంబాబు,జెడ్పీటీసీ శారదా రవీందర్,మునిసిపల్ చైర్మన్ సిందూర రవి వైస్ ఎంపీపీ అశోక్ రెడ్డి ఎమ్మార్వో రాంప్రసాద్ ఎంపీడీవో ధన్సింగ్ తదితరులు పాల్గొన్నారు.