కల్లుగీత కార్మిక సంఘం 2021 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ


తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ రూపొందించిన 2021 క్యాలెండర్ను రామ్ నగర్ లోని ప్రజాసంఘాల కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ తాళ్లపల్లి రామస్వామి గౌడ్ రిటైర్డ్ సూపర్డెంట్ గారు కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అర్బన్ జిల్లా అధ్యక్షులు బుర్ర సుధాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రామస్వామి గౌడ్ మాట్లాడుతూ కల్లుగీత కార్మిక సంఘం రూపొందించిన క్యాలెండర్ ఆలోచనాత్మకంగా ఉందన్నారు.గీత కార్మికుల గౌడుల సమస్యలు జీవన చిత్రం ప్రతిబింబించే విధంగా ఉందని అన్నారు. గౌడ కల్లుగీత కార్మికులు మారుతున్న సమాజ పరిస్థితులను అర్థం చేసుకుని వృత్తిని కాపాడుకుంటూనే వృత్తిదారులు తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలని తద్వారా అనేక రంగాలలో విస్తరించే విధంగా కృషి చేయాలని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలకు అనుగుణంగా గీత కార్మికుల తో పాటు ఇతర వెనుకబడిన కులాలను కలుపుకొని సమాజాభివృద్ధికి గౌడ్ కృషిచేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.ఈ సందర్భంగా వారి కృషికి ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి మాట్లాడుతూ కల్లుగీత వృత్తి లో ఉపాధి పెంపొందించేందుకు ప్రభుత్వం వరంగల్ జిల్లా కేంద్రంలో నీరా ప్లాంటు నెలకొల్పాలని గౌడ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమ నెలకొల్పి శాస్త్రీయ పద్ధతిలో ఉత్పత్తులను ప్రోత్సహించి ఉపాధి కల్పించాలని ప్రతి గీత సొసైటీకి చెట్ల పెంపకానికి పది ఎకరాల భూమిని కొని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించి కల్లుగీత వృత్తిని ఆధునీకరించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో లో జిల్లా కార్యదర్శి వాళ్ళలా గంగాధర్ రాష్ట్ర కమిటీ సభ్యులు మేరుగు వీరస్వామి జిల్లా కమిటీ సభ్యులు మడ్డి నారాయణ వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షులు తాళ్ల పెళ్లి నరసయ్య కమిటీ సభ్యులుసార వెంకటేష్ గండి విజయ్ జనగామ కుమారస్వామి మడ్డి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.