జై గౌడ సంక్షేమ సంఘం అనుబంధ సంఘమైన కల్లు గీత వృత్తి దారుల సంఘం జిల్లా అధ్యక్షులుగా పంతoగి దశరథ గౌడ్ నియమిస్తున్నట్లు జై గౌడ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు బూర మల్సుర్ గౌడ్ తెలిపారు.మంగళవారం జిల్లా కేంద్రంలోనీ ఆయన నివాసంలో జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మ గానీ శ్రీనివాస్ గౌడ్,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతoగి వీరస్వామి గౌడ్ తో కలిసి దశరథ గౌడ్ కు నియామక పత్రo అందజేశారు.అనంతరం జిల్లా అధ్యక్షులు గా నియమితులైన పంతoగి దశరథ గౌడ్ విలేకరులతో మాట్లాడారు. తన నియామకానికి సహకరించిన గౌడ సంఘం నేతలకు కృ తజ్ఞ తలు తెలిపారు.సంఘం బలోపేతానికి కృషి చేయడం తో పాటు గౌడ కులస్తుల హక్కుల సాధనకు ఉద్యమిస్తనన్నారు. గతంలో కూడా జై గౌడ ఉద్యమ సంఘం లో కీలక పాత్ర పోషించానని చెప్పుకొచ్చారు.