కల్లూరు రెవెన్యూ కార్యాలయం వద్ద శాంతియుత ఆందోళన కార్యక్రమం

ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో తెలంగాణ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం కల్లూరు మండల కమిటీ ఆధ్వర్యంలో కల్లూరు రెవెన్యూ కార్యాలయం వద్ద శాంతియుత ఆందోళన కార్యక్రమం చేపట్టారు….

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘం అధ్యక్షురాలు శేఖర్ మాట్లాడుతూ….

V.R.Oలకు స్పష్టమైన విధులు, బాధ్యతలు, జాబ్ చార్ట్ ప్రకటించాలని అన్నారు….

V.R.O లను రెవెన్యూ శాఖలోనే రీ లోకేట్ చేయాలని,పదోన్నతులు నిలుపుదల చేసిన వారికి వెంటనే పదోన్నతులు ఇవ్వాలని అన్నారు….

ఆరు,పన్నెండు, పద్దేనిమిది సంవత్సరాలకు నిలుపుదల చేసిన ఇంక్రిమెంట్లను వెంటనే ఇవ్వాలన్నారు…

అకాల మరణం చెందిన వీఆర్వోల కుటుంబాలలో 2015 సంవత్సరం నుండి కారుణ్య నియమకాలు చేపట్టలేదని,వెంటనే ఆ కుటుంబాలలో కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు…

వివిధ కారణాల వల్ల సస్పెండ్ అయిన వారికి పోస్టింగ్ తక్షణమే ఇవ్వాలని,సర్వీస్ రెగ్యులర్ కాని వారికి సర్వీస్ రెగ్యులర్ చేయాలని అన్నారు…

సర్వో టు ఆర్డర్లో ఇతర జిల్లాల్లో ఉండిపోయిన వీఆర్వోలను వారి సొంత జిల్లాలకు బదిలీలు చేయాలన్నారు…

సాధారణ బదిలీలు, మెడికల్ తో పాటు ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ పరస్పర బదిలీలు, కౌన్సిలింగ్ పద్ధతిలో బదిలీలు చేయాలని అన్నారు…

సామాజికపరంగా తీవ్రమైన నష్టాన్ని అనుభవిస్తు గ్రామస్థాయిలో ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్న వారిపై మానసిక ఒత్తిడికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు…

వెంటనే వారి డిమాండ్లను పరిష్కరించి తగిన న్యాయం చేయాలని కోరుతూ విఆర్వోల సంఘం తరఫున కల్లూరు ఆర్డిఓ కు వినతిపత్రం అందచేశారు….

ఈ కార్యక్రమంలో సెక్రెటరీ టీ రాము ఆ సంఘం తరఫున ఈఆర్వోలు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.