కల్లెపల్లి దళితుల భూములకు పట్టా దారు పాస్ బుక్స్ వెంటనే ఇవ్వాలి

పాలడుగునాగార్జున.kvps జిల్లా ప్రధాన కార్యదర్శి.

గతయాభైసంవత్సరాలుగా భూమిని నమ్ముకొని వరి పత్తి జొన్న శెనగ కంది సజ్జ పంటలు వేసు కొని జీవిస్తున్న మా భూములనుండీ ఫారెస్టు అధికారులు తొలగించాలని చూస్తే ఊరుకునేది లేదని వెంటనే డిజిటల్ పట్టాదారు పాస్పుస్తకాలు ఇవ్వాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్ చెయ్యడం జరిగింది. ఈరోజు దామరచర్ల మండలం కల్లెపల్లి గ్రామానికి చెందిన అరవై దళిత కుటుంబాలు జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్బంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ తాతా ముత్తాల కాలం నుండి ప్రభుత్వ పట్టాదారు పుస్తకాలు ఇచ్చారని భుాములను సేద్యం చేసుకొని జీవిస్తున్నారని అన్నారు రైతుబంధు కూడా అమలు అవుతుందని అన్నారు. ప్రభుత్వ స్కీమ్ లు బోరుమోటరు విద్యుత్ లైన్లు ట్రాన్స్ఫార్మర్లు బోరుబావులు అన్నీ తీసుకుని జీవిస్తున్నామని అర్ధాంతరంగా పాత పట్టాదారుపుస్తకాల బదులు డిజిటల్ పుస్తకాలు ఇవ్వకుండా భూముల నుండి మమ్మల్ని దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ గారు వెంటనే పరిశీలన జరిపి 60 దళిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరడం జరిగింది.జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓకు ఎంక్వయిరీ కొరకు రాయడం జరిగిందని అన్నారు. ఏది ఏమైనప్పటికీ నిరుపేద దళితులకు సంబంధించిన భూమి హక్కుల డిజిటల్ పాసు బుక్కులు వెంటనే ఇచ్చి రైతుబంధు అమలు చేసి ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎం జనార్దన్ నాయక్ ,ఉప సర్పంచ్ గంటా కంపు అంజయ్య కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి రెమడాల పరుశరాములు నాయకులు మహంకాళి జానకిరాములు శ్రీనివాస్ తదితర రైతులు పాల్గొన్నారు నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.