స్థానిక మండల కేంద్రంలో నూతనంగా ఆరభవించబడ్డ దాశరధి కళాబృందానికి మాజీ ఐసిడిఎస్ సూపర్వైజర్ నలమాస యాకలక్ష్మి తన సొంత ఖర్చులతో పదివేల రూపాయల చీరలను బహుకరించారు. ఆదివారం దాశరధి కళాబృందం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆ సంఘం అధ్యక్షురాలు తొట్ల వెంకటలక్ష్మి వారి కళాబృందం చీరలను బహుకరించిన యాకలక్ష్మి నీ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం దాత యాకలక్ష్మి మాట్లాడుతూ వెంకటలక్ష్మి లో ఉన్న కళను బయటికి తీసి ఈ సమాజానికి అందించాలన్న ఉద్దేశంతో ఆమె వెన్న అంటూ ఉంటూ ప్రోత్సహిస్తూ ఉన్నానని అన్నారు. ఈ సమాజంలో ఆడపిల్లలపై ఉన్న వివక్షత వారికి జరుగుతున్న అన్యాయాలపై తన రచనలతో తన గానంతో అనేక పాటలు రాసి ఈ సమాజానికి అందజేసిన నవయుగ కవిగా గుర్తింపు పొందుతున్న వెంకటలక్ష్మి ఈ సమాజంలో జరుగుతున్న రుగ్మతులపై ప్రజలను చైతన్య పరుస్తూ ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటానని అన్నారు. దళితవాడలో పేద కుటుంబంలో జన్మించి కవయిత్రిగా రాణించడం తో గర్వంగా ఉందన్నారు. అనంతరం దాశరధి కళాబృందం అధ్యక్షురాలు తోటల వెంకటలక్ష్మి మాట్లాడుతూ యాకలక్ష్మి గారు ఈ ప్రాంతంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ గా పని చేస్తున్న కాలం నుండి తనను ప్రోత్సహిస్తూ దాశరధి కళాబృందానికి గౌరవ అధ్యక్షులు ఉంటూ ఈరోజు తన సొంత డబ్బులతో చీరలను బహుకరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమకు ఏ ఆపదొచ్చిన ఆదుకుంటూ తన ఉదార స్వభావాన్ని చూపిస్తున్నారన వారు చేసిన మేలును మరువలేమని ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటామన వారన్నారు ఈ కళాబృందానికి కాంచనపెల్లి వెంకన్న రెండు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారని వారికి కూడా కృతజ్ఞత తెలిపారు. అనంతరం దాశరధి కళాబృందం బోనాలతో జానపద గేయాలను ఆలపిస్తూ లయబద్ధంగా నృత్యాలు చేస్తూ చూపరులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో దాశరధి కళాబృందం సభ్యులు సోమలింగ, సునీత, ఉపేంద్ర, ఉప్పమ్మ, మంజుల, సోమక్క, గురవమ్మ, రజిత, కళ్యాణి, గణిత, సునీత, ఉపేంద్ర, పద్మమైసమ్మ, గౌరమ్మ, మంగమ్మ, జయమ్మ, యాకమ్మ, ఎల్లమ్మ, కలమ్మ, ఉప్పలమ్మ, కేతమ్మ, ముత్తిలింగ తదితరులు పాల్గొన్నారు.