కళ్యాణలక్ష్మి -షాదీముభారక్ చెక్కులు పంపిణీ

కురవి మండల కేంద్రంలో కళ్యాణలక్ష్మి -షాదీముభారక్ చెక్కులు పంపిణీ చేసిన డోర్నకల్ శాసన సభ్యులు డి.ఎస్.రెడ్యానాయక్ ..ఈరోజు కురవి మండల కేంద్రంలోని ఓం ఫంక్షన్ హాల్లో జరిగిన ఈకార్యక్రమంలో డోర్నకల్-కురవి మండలాలకు చెందిన 89మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులు డోర్నకల్ శాసన సభ్యులు డి.ఎస్.రెడ్యానాయక్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది .ఈసందర్బంగా రెడ్యానాయక్ మాట్లాడుచు దేశంలో ఎక్కడ లేనివిధంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన కుటుంబాల వారు ఆడపిల్ల పెళ్లిచేసి ఆర్ధికంగా కష్టాలు పడుచున్న వారి కష్టాలు తీర్చటం కోసం వారి ఇంటికి పెద్ద దిక్కుగా నిలిచి కల్యాణ లక్ష్మీ షాదీముభారక్ పథకం ద్వారా రూ.100116/-లు అందిస్తున్న సీఎం కేసీఆర్ కి తెలంగాణ ప్రజానీకం అండగా నిలవాలని అన్నారు..ఈకార్యక్రమంలో కురవి ఎంపీపీ శ్రీమతి.గుగులోత్ . పద్మావతి – రవినాయక్ ,మహబూబాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి.బజ్జూరి.ఉమ – పిచ్చిరెడ్డి , మరిపెడ డివిజన్ ఆత్మ చైర్మన్ తోట.లాలయ్య ,డోర్నకల్ ఎంపీపీ డి.ఎస్.బాలునాయక్ , డోర్నకల్ జడ్పీటీసీ పొడిశెట్టి.కమల – రామనాధం ,డోర్నకల్ మండల పార్టీ అధ్యక్షుడు నున్న.రమణ ,pacs చైర్మన్లు దొడ్డ.గోవర్ధన్ రెడ్డి,గార్లపాటి. వెంకట్ రెడ్డి, కత్తెరసాల.విద్యాసాగర్, ఆలయ చైర్మన్ బాధావత్ రామునాయక్, బాధావత్.రాజునాయక్,వైస్ ఎంపీపీ దొంగలి.నర్సయ్య,చిన్నం.భాస్కర్,నూతక్కి.నర్సింహారావు, బానోత్.రమేష్, బెడద.వీరన్న.బానోత్.తుకారాం నాయక్ అధికారులు, లబ్దిదారులు వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.