కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరూరి

వరంగల్ మండలానికి చెందిన 36మంది కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు 36లక్షల 04వేల 176రూపాయల విలువగల చెక్కులను వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు పంపిణీ చేశారు. హంటర్ రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గిందని తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గారు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జన్ను శిభారాణి అనిల్, తూర్పాటి సులోచన సారయ్య, ఇతర ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.