కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సీతక్క

గోవిందరావుపేట మండలం తహశీల్దార్ కార్యాలయం లో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ రోజున గోవిందరావుపేట మండలంలోని తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో తహశీల్దార్ రమాదేవి ఆధ్వర్యంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి కార్యక్రమం ఏర్పాటు చేయగా అట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి మరియు ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే దనసరి సీతక్క విచ్చేసి 18 మంది లబ్ది దారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రతి ఒక్క లబ్ది దారుడు ప్రభుత్వం నుండి లభించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలి అని, 18 సంవత్సరాలు నిండకముందే అమ్మాయిలకు వివాహాలు చేయవద్దని, బాల్య వివాహాలకు తావు ఇవ్వకుండా, వారి కాళ్ళ మీద వారు నిలబడేలా తల్లీ తండ్రులు పిల్లలకు మంచి చదువులు చదివించి వివాహాలు చేయాలని అన్నారు. ప్రభుత్వం నుండి వచ్చే ఏ సంక్షేమ పథకాలు అయినా అర్హులైన అభ్యర్థులకు వచ్చేలా తాను కృషి చేస్తున్న అని ములుగు నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న అని సీతక్క ఈ సందర్భముగా అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధర్మ అంజిరెడ్డి , ఎంపీటీసీలు ఆలూరి శ్రీనివాస రావు, గోపీదాసు ఏడుకొండలు, గుండెబోయిన నాగలక్ష్మి-అనిల్ యాదవ్, సర్పంచులు లావుడ్య లక్ష్మి-జోగనాయక్, ముద్దబోయిన రాము, ఉపసర్పంచులు తేళ్ల హరిప్రసాద్, బద్దం లింగా రెడ్డి, సహకార సంఘ పాలక వర్గ సభ్యుడు జెట్టి సోమయ్య, మండల సీనియర్ నాయకులు కణతల నాగేందర్ రావు, పాలడుగు వెంకటకృష్ణ, పెండెం శ్రీకాంత్ మరియు తదితర నాయకులు గోవిందరావుపేట మండల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.