తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, యం.ఎల్.సి శ్రీ కడియం శ్రీహరి గారు పరకాల యం.ఎల్.ఎ శ్రీ చల్లా ధర్మారెడ్డి గారి తో కలిసి కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముభారక్ చెక్కుల పంపిణీ చేశారు……
పరకాల నియోజకవర్గం పరిధిలోని పలు మండలాల లబ్దిదారులకు సంబంధించి కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముభారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం పరకాలలోని యం.ఎల్.ఎ క్యాంపు కార్యాలయంలో చేపట్టడం జరిగింది, ఈ కార్యక్రమములో తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, యం.ఎల్.సి శ్రీ కడియం శ్రీహరి గారు ముఖ్య అతిధి గా పాల్గొని చెక్కుల పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమములో కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ….
ప్రతి పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్షి ఎంతో ఆర్ధిక పరిపుష్టి గా దోహద పడుతుందన్నారు, రాష్ట్ర ముఖ్య మంత్రి కె.సి.అర్ గారు ఒక కుటుంబ సభ్యుడి లాగా బాధ్యత తీసుకొని ఆర్ధిక సహాయం అందిస్తున్నారు అని పేర్కొనడం జరిగింది.